hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy Best Foods arrow
  • గర్భధారణ సమయంలో కర్బూజ: ప్రయోజనాలు, ప్రభావాలు, పోషక విలువలు (Muskmelon in Pregnancy: Benefits, Effects and Nutritional Values in Telugu) arrow

In this Article

    గర్భధారణ సమయంలో కర్బూజ: ప్రయోజనాలు, ప్రభావాలు,  పోషక విలువలు (Muskmelon in Pregnancy: Benefits, Effects and Nutritional Values in Telugu)

    Pregnancy Best Foods

    గర్భధారణ సమయంలో కర్బూజ: ప్రయోజనాలు, ప్రభావాలు, పోషక విలువలు (Muskmelon in Pregnancy: Benefits, Effects and Nutritional Values in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భిణీ స్త్రీలు ఏమి తినడానికి ఇష్టపడతారు? పిండి వంటలు? కుక్కీలు? చాక్లెట్? కర్బూజను ప్రయత్నించండి. భారతదేశం వంటి దేశాలలో, కర్బూజ గర్భిణీ స్త్రీలకు ఇష్టమైన ఆహారం. కర్బూజలు రుచికరమైనవి, తాజాగా ఉండటమే కాకుండా గర్భిణీ స్త్రీల శరీరంలో స్థిరమైన మార్పులకు సహాయపడే పోషకాలతో నిండి ఉంటాయి.

    గర్భధారణ సమయంలో కర్బూజ తినడం సురక్షితమేనా? (Is Eating Muskmelon During Pregnancy Safe in Telugu?)

    మీరు గర్భవతి అయితే, కర్బూజ తినడం మంచిది. భారతదేశంలో, ఈ పండ్లను ఖర్బుజా అని పిలుస్తారు. దీనిలో తక్కువ కేలరీలు ఉన్నందున గర్భిణీ స్త్రీలకు మంచి చిరుతిండి. అంతే కాదు, కర్బూజాలో రక్తం గడ్డకట్టకుండా, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే పదార్థాలు కూడా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్‌ను ఆపుతాయి, ఇంకా ప్రతిస్కందకాలు మీ రక్తం చిక్కపడకుండా చేస్తాయి. గర్భధారణ సమయంలో రక్తం చిక్కబడటాన్ని ప్రమాదకరంగా పరిగణించబడతారు.

    కర్బూజా పోషక విలువలు (Muskmelon Nutritional Values in Telugu)

    కర్బూజాలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇందులో ఇనుము, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు, విటమిన్లు చాలా ఉన్నాయి. ఈ పండులో విటమిన్ బి9 అని కూడా పిలువబడే ఫోలిక్ యాసిడ్లు చాలా ఉన్నాయి. గర్భధారణ సమయంలో ఇది చాలా ముఖ్యమైన విటమిన్. ఎందుకంటే ఇది పుట్టబోయే పిల్లలకు న్యూరల్ ట్యూబ్స్ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో జింక్ కూడా ఉంది. ఇది పిండం యొక్క ఆరోగ్యకరమైన కణజాల పెరుగుదలకు ముఖ్యమైనది. కర్బూజాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, రక్తం గడ్డకట్టకుండా నిరోధించే అంశాలు కూడా చాలా ఉన్నాయి (గడ్డకట్టడాన్ని నిరోధించే లక్షణాలు).

    కర్బూజా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: (The Health Benefits of Muskmelons in Telugu)

    గర్భధారణ సమయంలో కర్బూజ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది.

    1. ట్యూబ్‌లో కలిగే లోపాలను నివారిస్తుంది ( Avoids Tube Defects)

    మొదటి త్రైమాసికంలో, శిశువు న్యూరల్ ట్యూబ్, మెదడు, వెన్నుపాముగా ఏర్పడుతుంది. కర్బూజాలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, మీరు దానిని తిన్నప్పుడు, మీకు ప్రతిరోజూ అవసరమైన విటమిన్ బి9 ఎక్కువగా లభిస్తుంది. ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు కర్బూజ తినడానికి ఇది ముఖ్యమైన కారణాలలో ఒకటి.

    2. రక్తం గడ్డకట్టడాన్ని ఆపుతుంది (Stops Blood Clots)

    గర్భధారణ సమయంలో రక్తం గడ్డకట్టవచ్చు. రక్తం గడ్డకట్టడం చాలా అరుదు అయినప్పటికీ, కర్బూజ తినడం వల్ల రక్తం పలుచ బడటానికి, వాటిని ఆపడానికి సహాయపడుతుంది.

    3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది ( Enhances Immunity)

    కర్బూజాలో ఉండే కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తయారవకుండా ఆపుతాయి. ఇది కొత్త కణాలను తయారు చేయడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా తల్లి ఇంకా శిశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

    4. జీర్ణక్రియకు తోడ్పడుతుంది (Supports Digestion)

    గర్భం యొక్క రెండవ, మూడవ త్రైమాసికంలో, కాబోయే తల్లులకు గుండెల్లో మంట అనేది ఒక సాధారణ సమస్య. ఈ సందర్భంలో, కర్బూజ మీ కడుపులో సమస్యలు లేకుండా ఉంచడానికి సహాయపడే ఒక ఆహారం. కర్బూజాలో ఉండే విటమిన్ సి మీ శరీరంలోని అరుగుదలలో, ఇంకా ఆహారం తీసుకునే సామర్థ్యంలో సహాయపడుతుంది.

    5. రక్తహీనతను నివారిస్తుంది (Avoids Anaemia)

    ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, రక్తహీనత ఆమెకు, బిడ్డకు ప్రమాదకరం. విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండే కర్బూజ తినడం ద్వారా రక్తహీనతను అదుపులో ఉంచుకోవచ్చు. ఇనుము జీర్ణవ్యవస్థలోకి రాకపోతే శరీరం ఉపయోగించదు. విటమిన్ సి, ఇనుము జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది.

    6. కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనమిస్తుంది ( Assists with Leg Cramps)

    ముఖ్యంగా రాత్రి సమయంలో, చాలా మంది గర్భిణీ స్త్రీలకు కాళ్ళ నొప్పులు వస్తాయి. తగినంత పొటాషియం పొందకపోవడం వల్ల కాళ్ళ నొప్పులు కలుగుతాయి. ఈ ఖనిజాన్ని ఎక్కువగా పొందడానికి కర్బూజ మంచి మార్గం.

    7. శిశువు దృష్టిని మెరుగుపరుస్తుంది ( Improves Baby's Vision)

    శిశువు కళ్ళు గర్భం యొక్క మొదటి కొన్ని నెలల్లో ఏర్పడటం ప్రారంభిస్తాయి, గర్భం ముగిసే సమయానికి పూర్తిగా రక్తం సరఫరా చేయబడుతుంది. ఈ సమయంలో, విటమిన్ ఏ అధికంగా ఉండే కర్బూజ వంటి ఆహారాన్ని తినడం వల్ల శిశువులు కంటి సమస్యలతో పుట్టే అవకాశం బాగా తగ్గుతుంది.

    గర్భధారణ సమయంలో ఆరోగ్యకరంగా కర్బూజా తినడానికి మార్గాలు (Healthy Ways to Eat Muskmelon in Pregnancy in Telugu)

    పండ్లను తినడానికి ముందు, మీరు లిస్టెరియోసిస్ బారిన పడకుండా బాగా కడిగి శుభ్రం చేయడం చాలా అవసరం. కర్బూజ చర్మాన్ని శుభ్రం చేయడానికి, పారే నీటిలో బాగా కడగాలి. ఆపై గిన్నెలో పలుచన చేసిన వెనిగర్ వేసి దానిలో కర్బూజాను కొన్ని సెకన్ల పాటు ఉంచండి. మీరు దానిని కోసే ముందు మళ్ళీ నీటితో కడగాలి. కత్తి, కట్టింగ్ బోర్డ్‌ను బాగా శుభ్రంగా ఉండేలా చూస్కోండి. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, శుభ్రమైన కర్బూజ తినడం వల్ల ఆమె శరీరానికి ఎటువంటి హాని జరగదు. ఆమెకు చాలా పోషకాలు అందుతాయి. తమ ఆహారంపై శ్రద్ధ వహించే వారు, అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలని కోరుకునే తల్లులకు కర్బూజా అనేది ప్రకృతి ప్రసాదించిన కానుక. మీకు ఈ పండు తినడం వల్ల అలెర్జీ ప్రతిచర్య కలిగి ఉంటే, మీరు ఎక్కువగా తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ఆప్రికాట్స్ తీసుకోవడం

    గర్భధారణ సమయంలో కర్బూజ తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలు? (Effects of Consuming Muskmelon During Pregnancy in Telugu?)

    మీరు గర్భవతిగా ఉన్నప్పుడు కర్బూజా తినడం సురక్షితమైనది. కొన్నిసార్లు లిస్టెరియా అనే బ్యాక్టీరియా పండు యొక్క ఉపరితలంపై ఉండవవచ్చు. కాబట్టి, ఆ పండ్లకు దూరంగా ఉండాలని మీ సన్నిహితులు మీకు చెప్పి ఉండవచ్చు. మీరు పండ్లను సరిగ్గా కడగకపోతే అది మీ శరీరంలోకి చేరుతుంది. లిస్టెరియా అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది గర్భధారణ సమయంలో సంభవించే కొన్ని సమస్యలతో ముడిపడి ఉంటుంది. అలాగే ఈ పండ్ల వల్ల అలెర్జీ ఉందని తెలిసిన మహిళలు దీనిని తినకూడదు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇది గర్భిణీ స్త్రీలకు సురక్షితమైన, ఇంకా ఆరోగ్యకరమైన పండు.

    Tags

    Muskmelon during pregnancy in telugu, Muskmelon benefits during pregnancy in telugu, Side effects of Muskmelon in telugu, Can pregnants eat Muskmelon during pregnancy in telugu, Is Muskmelon safe during pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |