Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
ఒక గర్భవతి ప్రసవ సమయం దగ్గర పడ్డపుడు తన ఆహారపు అలవాట్లు ఆటోమేటిగ్గా ఇంప్రూవ్ అవుతాయి. మీరు గర్భవతిగా ఉన్నపుడు మీ శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం మరిన్ని విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్య పోషకాలు అవసరం అవుతాయి. మీ బిడ్డ సరైన విధంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేందుకు మీరు సమతుల్య ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష(ప్రూనే) వంటి డ్రై ఫ్రూట్స్‌ను మీరు మీ డైట్లో చేర్చుకోవాలి. ఇవి పుట్టబోయే బిడ్డకు మరియు తల్లికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. గర్భవతిగా ఉన్నపుడు ప్రూనే తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు, ప్రమాదాలను గురించి మరింత తెలుసుకునేందుకు ఈ కథనం పూర్తిగా చదవండి.
ముఖ్యంగా ఎండుద్రాక్ష(ప్రూనే) అనేది డ్రైడ్ ప్లమ్ పండు నుంచి వస్తుంది. (వివిధ ప్రాంతాలలో ఈ పండును వివిధ రకాల పేర్లతో పిలుస్తారు) ఇండియాలో అల్బుఖారా అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఇవి ఒకటి. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) తినాలని నిపుణులు సిఫారసు చేస్తారు. ఎందుకంటే ఇవి తల్లీ, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాల్ని కలిగిస్తాయి.
ఎండుద్రాక్ష(ప్రూనే)లో పోషకాలు అధికంగా ఉన్నందున గర్భవతిగా ఉన్నపుడు తినడం సురక్షితం. ఎండుద్రాక్ష (ప్రూనే)లో ఐరన్, పొటాషియం, విటమిన్ C, మెగ్నీషియం, న్యాచురల్ షుగర్స్, విటమిన్ A, విటమిన్ E, అంతే కాకుండా డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కడుపులో పెరుగుతున్న పిండం పెరుగుదలతో పాటుగా తల్లి ఆరోగ్యం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇవి గర్భాశయ ధృడత్వంలో సహాయపడతాయి. ఇవి లేబర్‌ను మరియు ప్రసవాన్ని సులభతరం చేస్తాయి. మీ కడుపులో ఉన్న పిండం ఆరోగ్యంతో పాటుగా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునేందుకు గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) తినడం ఉత్తమ మార్గం.
గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) ఒక ఆరోగ్యకరమైన చిరుతిండి(స్నాక్). ఇవి వెంటనే ఆకలిని తగ్గించడంతో పాటుగా.. వివిధ రకాల ఫైబర్లు మరియు విటమిన్స్‌ను కలిగి ఉంటాయి. ఫలితంగా గర్భవతులు తమ కండరాలను బలవంతంగా తయారు చేసుకుంటారు. ఇది డెలివరీ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(ప్రూనే) తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి.
మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం గర్భధారణ సమయంలో శరీరం అధికంగా ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎండుద్రాక్ష(ప్రూనే) గర్భధారణ సమయంలో బయటి గోడల కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) రసం మలబద్ధకం చికిత్సలో ఉపయోగపడుతుంది.
గర్భధారణ సమయంలో తల్లి శరీరానికి అదనపు ఐరన్ అనేది చాలా అవసరం. మీరు ప్రతి రోజు తినే ఆహారం తీసుకుంటే వచ్చే ఐరన్ సరిపోదు. ఐరన్ కొరతను అధిగమించేందుకు గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష(ప్రూనే) వంటి పండ్లు తినడం మంచిది. ఈ పండ్లలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది.
ఎండుద్రాక్ష (ప్రూనే) లో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. రక్తపోటును నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.
గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష(ప్రూనే)ను తీసుకోవడం వల్ల అవి ఆందోళన, డిప్రెషన్‌ను మేనేజ్ చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ ఆందోళన డిప్రెషన్ మేనేజ్మెంట్లో సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో వికారాన్ని తగ్గించేందుకు ఎండుద్రాక్ష (ప్రూనే) తీసుకోవడం నేచురల్ మెథడ్. ఇందులో ఉండే ముఖ్యమైన విటమిన్స్ మరియు మినరల్స్ మోషన్ సిక్‌నెస్‌ను నివారించి మీకు మంచి అనుభూతిని అందిస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో వికారం వాంతులు
గర్భధారణలో ఎండుద్రాక్ష(ప్రూనే)ను ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, మరియు డయేరియా వంటి సమస్యలు కూడా ఉంటాయి. పైన పేర్కొన్న సమస్యలలో మీరు ఏదేనీ సమస్యను గుర్తించినట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష (ప్రూనే) ను రోజువారీగా ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడి సలహా తీసుకోండి. గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష (ప్రూనే) తినడం మంచిది కాదు.
డ్రై ఫ్రూట్స్ వల్ల దంతాలు తరచుగా మరకలుగా తయారవుతాయి. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దంతాలు డ్యామేజ్ అవుతాయి. మీ దంతాలకు ఎప్పుడూ ఏమీ అంటకుండా చూసుకోండి.
అవును.. గర్భవతిగా ఉన్నపుడు ఎండుద్రాక్ష (ప్రూనే) తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఎండుద్రాక్ష(ప్రూనే)లో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఈజీగా శరీరానికి అందుతుంది. తల్లి మరియు పిల్లల కళ్లు సరైన విధంగా ఉండడం, చర్మం, మరియు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా ఎండుద్రాక్ష (ప్రూనే) మీద ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎండుద్రాక్ష (ప్రూనే) సరైన ఆహారం. మీ గర్భంలోపల అభివృద్ధి చెందుతున్న మీ పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది దోహదపడుతుంది.
అవును చేస్తుంది. ఎండుద్రాక్ష(ప్రూనే)లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో ఇది కీలకంగా పని చేస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర కాలం (ప్యూర్పెరియం) దశలు ఏమిటి?
తగ్గిస్తాయి. ఇవి ఒక రకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇవి మోషన్ సిక్‌నెస్‌ను తగ్గించవచ్చు.
ఎండు ద్రాక్ష (ప్రూనే)లో బెటా-కెరోటిన్ మరియు విటమిన్ A ఉన్నాయి. ఇవి పెరుగుతున్న పిండం కంటి అభివృద్ధికి సహాయపడతాయి. కడుపులో ఉన్నపుడు శిశువు ఆరోగ్యకరంగా పెరిగేందుకు ఇవి చాలా ముఖ్యం. ఎవరైతే గర్భవతులు డిప్రెషన్లో ఉంటారో లేదా ఆతృతతో ఉంటారో వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ఎండు ద్రాక్ష (ప్రూనే) దంతాలకు అంటుకునే అవకాశం ఉంది. కావున మీ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది. ఎండుద్రాక్ష (ప్రూనే) నిస్సందేహంగా గర్భవతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర ఆహారాల మాదిరిగానే ఎండుద్రాక్ష(ప్రూనే)ను కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఈ పండ్లను తీసుకునే ముందు మీ వైద్యుడితో మాట్లాడి.. ప్రతిరోజు వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి. ప్రతి గర్భం వేరుగా ఉంటుంది కావున.. మీరు గర్భవతిగా ఉన్న పూర్తి కాలం వీటిని తీసుకోవడం వలన ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. సురక్షితంగా ఉండేందుకు.. అనవసరమైన ఇబ్బందులను నివారించేందుకు గర్భవతిగా ఉన్న కాలంలో వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |