hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Skin Changes arrow
  • గర్భధారణ కాలంలో పెదవులు పొడిబారడం: లక్షణాలు ఇంకా కారణాలు (Lips Dry During Pregnancy: Symptoms and Causes in Telugu) arrow

In this Article

    గర్భధారణ కాలంలో పెదవులు పొడిబారడం: లక్షణాలు ఇంకా కారణాలు (Lips Dry During Pregnancy: Symptoms and Causes in Telugu)

    Skin Changes

    గర్భధారణ కాలంలో పెదవులు పొడిబారడం: లక్షణాలు ఇంకా కారణాలు (Lips Dry During Pregnancy: Symptoms and Causes in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణలో శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. అయితే, అలాంటి మార్పులలో ఒకటి పొడిబారిన పెదవులు ఇంకా చర్మం. ఈ బ్లాగ్‌ పొడిబారిన పెదవుల ఇంకా చర్మాల అతిసాధారణ లక్షణాలు ఇంకా కారణాలు అలాగే గర్భధారణ సమయంలో ఈ పొడి చర్మం నుండి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుపుతుంది. మరింత తెలుసుకొనేందుకు ఇది చదవండి!

    పెదవులు పొడిబారడం లక్షణాలు (Dry Lips Symptoms in Telugu)

    పెదవుల పగుళ్లు లేదా చీలిటిస్ అనేది చాలా మంది మహిళలు తమ గర్భధారణ కాలంలో ఎదుర్కొనే ఒక సాధారణ పరిస్థితి. ఇది చాలా తీవ్రమైనది కానప్పటికీ, దీన్ని సులభంగా నయం చేసుకోవచ్చు. అయితే, దానిని గుర్తించడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో పొడిబారిన పెదవులు సాధారణంగా డీహైడ్రేషన్‌ను సూచిస్తాయి. అలాగే, ఈ పరిస్థితి వల్ల అసౌకర్యం అనిపిస్తుంది, అంతేకాక కారంగా లేదా ఉప్పగా ఉండే పదార్థాలు తినేటప్పుడు మండటం లాంటి బాధను కూడా కలిగించవచ్చు. పగిలిన లేదా పొడి పెదవుల కొన్ని సాధారణ లక్షణాలు క్రింద ఉన్నాయి:

    • పెదవుల పైచర్మంపై పగుళ్లు
    • పెదవులపై పొట్టు ఏర్పడటం
    • పుండ్లు పడి కొన్నిసార్లు రక్తస్రావం కూడా కావచ్చు
    • పెదవులపై పొలుసులు ఏర్పడటం
    • ఉప్పగా, పుల్లగా, లేదా కారంగా ఉండే పదార్థాలు తిన్నప్పుడు నొప్పి మంట కలగడం
    • వాపు
    • పెదవులపై పొట్టు ఊడటం

    మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువుల్లో పగిలిన పెదవులకు ఎలాంటి చికిత్స చేయాలి?

    గర్భధారణలో పెదవులు ఇంకా చర్మం పొడిబారడానికి కారణాలేవీ? (What Causes Dry Lips and Skin in Pregnancy in Telugu?)

    • గర్భధారణ సమయంలో పెదవులు పొడిబారిపోతాయని చాలా మంది మహిళలు తెలిపారు. గర్భధారణ సమయంలో పెదవులు పొడిబారడానికి గల కారణాలు ఏమిటని గర్భవతులు అనుకుంటూ ఉండవచ్చు. దీనికి కొన్ని వివరణలు ఉన్నాయి; అదృష్టవశాత్తూ, ఇలా పొడిబారడాన్ని తగ్గించేందుకు గర్భిణీలు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి.
    • గర్భధారణ సమయంలో పెదవులు ఇంకా చర్మం పొడిబారడానికి అతి సాధారణ కారణాలలో ఒకటి ప్రొజెస్టెరాన్ హార్మోన్. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల చర్మంలో ఉండే తైలగ్రంధులు తక్కువ తైలాన్ని ఉత్పత్తి చేస్తాయి, అందువల్ల చర్మం ఇంకా పెదవులు పొడిబారడం జరుగుతుంది. వాతావరణ మార్పులు ఇంకా తేమ స్థాయిలలో సంభవించే మార్పులు దీనిని మరింత తీవ్రతరం చేస్తాయి.
    • గర్భధారణ సమయంలో చర్మం ఇంకా పెదవులు పొడిబారడానికి మరో కారణం డీహైడ్రేషన్ అవ్వవచ్చు, దానికి కారణం, గర్భిణీలు తగినంత నీరు త్రాగకపోవడం కూడా కావచ్చు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో తరచుగా వాంతులు అయినప్పుడు కూడా అది డీహైడ్రేషన్‌కి దారితీయవచ్చు, అందువల్ల గర్భధారణ సమయంలో పెదవులు పొడిబారడం జరుగుతుంది.
    • పెరిగిన రక్త పరిమాణానికి, గర్భధారణ సమయంలో చర్మం ఇంకా పెదవులు పొడిబారడానికి కూడా సంబంధం ఉంది. కొన్నిసార్లు గర్భధారణ సమయంలో రక్తంలోని చక్కెర స్థాయిలో పెరుగుదల మూత్రపిండాలు పనిభారం పెరిగేందుకు కారణమవుతుంది, దానివల్ల తరచుగా అది మూత్రవిసర్జనకు దారితీస్తుంది, అందువల్ల తర్వాత అది డీహైడ్రేషన్‌ కలిగిస్తుంది.
    • అయితే, గర్భంలో పెరుగుతున్న శిశువుకు అనుగుణంగా, కాబోయే తల్లి శరీరం కూడా ఎన్నో మార్పులకు లోనవుతుంది. అందువల్ల చర్మం సాగడం వల్ల అది దాని సాగిముడుచుకొనే గుణాన్ని కోల్పోతుంది. దానివల్ల, గర్భధారణ సమయంలో చర్మం పలుచగా ఇంకా పొడిబారడం జరుగుతుంది.
    • గర్భధారణ సమయంలో చర్మం ఇంకా పెదవులు పొడిబారడానికి ఇవి చాలా సాధారణ కారణాలు. ఇప్పుడు, గర్భధారణ సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన పెదవులలో కనిపించే మరికొన్ని మార్పులను చూద్దాం.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: నవజాత శిశువుల్లో చర్మం పొట్టుగా కావడానికి కారణాలు ఏమిటి?

    గర్భధారణలో ఇంకేవైనా పెదవులలో కలిగే మార్పులు ఉంటాయా? (Are There Any Further Lip Changes That Can Happen While You’re Pregnant in Telugu?)

    పెదవులు పొడిబారడంతోపాటు, పెదవుల వాపు అనేది గర్భధారణ సమయంలో కనిపించే మరో మార్పు. 'గర్భధారణ పెదవులు' (గర్భధారణలో పెదవులలో వచ్చే మార్పు) అనేది ఈ సమయంలో కన్పించే సాధారణమైన మార్పు. ఎందుకంటే గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో, రక్త నాళాలు (కేశనాళికలు) విస్తరించుకోవడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కొంతవరకు పెదవులను నిండుగా ఇంకా బొద్దుగా కనబడేలా మారుస్తుంది. గర్భధారణ సమయంలో రక్త కేశనాళికల సంఖ్య పెరగడం వల్ల అవి పెదాలను ఎర్రగా కనిపించేలా చేస్తుంది.

    పెదవులు పొడిబారడం ఇంకా వాపుతో పాటు, కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో పెదవులలో మరిన్ని మార్పులను కూడా పొందుతారు. వీటిలో పెదవులలో పెరిగిన సున్నితత్వం, కొద్దిగా రంగు మారడం (కొన్ని సందర్భాల్లో) ఇంకా గర్భధారణ సమయంలో పెదవులు ముదురు రంగులోకి మారడం వంటివి ఉంటాయి. ఈ మార్పులు సాధారణంగా తాత్కాలికమైనవి ఇంకా గర్భధారణ తర్వాత యధాస్థితికి వస్తాయి. అయినప్పటికీ, ఈ మార్పులలో ఏవైనా అలాగే కొనసాగితే లేదా సమస్య తీవ్రంగా మారినట్లయితే, వాటి వల్ల అపాయం ఉందా? లేదా ఏవైనా తీవ్రమైన పరిస్థితిని సూచింస్తుందో తెలుసుకొనేందుకు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

    గర్భధారణ సమయంలో చర్మం ఇంకా పెదవులు పొడిబారడం నుండి ఉపశమనం ఎలా పొందవచ్చు? (How to Relieve Dry Skin and Lips During Pregnancy in Telugu?)

    • గర్భధారణ సమయంలో చర్మం ఇంకా పెదవులు పొడిబారినట్లయితే, పొడిబారడాన్ని తగ్గించుకొనేందుకు ఉపయోగపడే కొన్ని పనులు చేయవచ్చు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:
    • ముందుగా, పుష్కలంగా నీరు త్రాగుతూ ఉండాలి. గర్భధారణ సమయంలో వాంతులవ్వడం సర్వ సాధారణం. అయితే, ఇది చర్మం ఇంకా పెదవులు పొడిబారేలా చేసే డిహైడ్రేషన్‌కి దారితీస్తుంది. నీరు త్రాగడం వల్ల వారి చర్మం లోపలి నుండి తేమగా ఉండేలా సహాయపడుతుంది.
    • రెండవది, ఎమోలియెంట్ కలిగి ఉన్న లిప్ బామ్ లేదా ఆయింట్మెంట్ వాడాలి. ఇది తేమను పట్టిఉంచేందుకు సహాయపడుతుంది, ఇంకా పెదవులు మరింత పొడిబారకుండా కాపాడుతుంది. అయితే, శిశువుకు హాని తలపెట్టే ఎలాంటి పదార్థాలు లేని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని తెలుసుకోవాలి.
    • చివరగా, చల్ల గాలి ఇంకా చలి ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండాలి. కాబోయే తల్లి తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళినపుడు, తమ చర్మాన్ని రక్షించుకొనేందుకు వీలైనంత వరకు శరీరాన్ని కప్పుకోనెల చూడాలి. పొడిబారడాన్ని తగ్గించడంలో దోహదపడే హ్యూమిడిఫైయర్‌ లాంటివి తమ ఇంటిలో వాడేందుకు కూడా ప్రయత్నించవచ్చు, అయితే వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానాన్ని మానుకోవాలి.
    • పొడిబారడం ఎక్కువై ఇంకా దురదతో కూడా ఉంటే, అలాంటి సందర్భాలలో, వైద్యుడిని కూడా సంప్రదించవచ్చు. పొడిబారడం నుండి ఉపశమనం పొందేందుకు సరైన క్రీమ్ లేదా ఆయింట్మెంట్‌ని వైద్యులు సూచించవచ్చు.

    Tags:

    Dry lips during pregnancy in telugu, symptoms of dry lips during pregnancy in telugu, Dry lips causes in telugu, Treatment for dry lips during pregnancy in telugu, How get relieved from dry lips during pregnancy in telugu.

    Dry Lips During Pregnancy in English, Dry Lips During Pregnancy in Tamil, Dry Lips During Pregnancy in Hindi,Dry Lips During Pregnancy in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |