Scans & Tests
3 November 2023 న నవీకరించబడింది
తలసేమియా అనేది తల్లిదండ్రుల నుండి వారి పిల్లలకు సంక్రమించే రక్త రుగ్మత. తలసేమియా ఉన్నట్లయితే, వారి శరీరం సాధారణం కంటే తక్కువ హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. హిమోగ్లోబిన్ మన ఎర్ర రక్త కణాలలో భాగం. ఇది మన కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. తలసేమియా తక్కువగా, మితంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. తేలికపాటి తలసేమియాకు సాధారణంగా చికిత్స అవసరం లేదు. కానీ మితమైన.. తీవ్రమైన తలసేమియా రక్తహీనత (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య), అలసట మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీకి తలసేమియా ఉన్నట్లయితే, వారు గర్భస్రావం, శిశువు నెలలు నిండకుండానే పుట్టడం లేదా తక్కువ బరువున్న శిశువును కలిగి ఉండటం వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల.. గర్భధారణ సమయంలో తలసేమియా పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్ష డాక్టర్ రోగికి చికిత్స అవసరమా లేదా అని నిర్ధారించడంలో సహాయపడుతుంది.
తలసేమియా అనేది వంశపారంపర్య రక్త రుగ్మత సమస్య. ఇది తేలికపాటి నుండి తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుంది. తలసేమియాలో రెండు రకాలు ఉన్నాయి: ఆల్ఫా మరియు బీటా. ఆల్ఫా తలసేమియా సర్వసాధారణం. ఇది సాధారణంగా తేలికపాటి రక్తహీనతకు దారితీస్తుంది. బీటా తలసేమియా అంత సాధారణమైనది కాదు కానీ మరింత తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుంది. గర్భధారణ సమయంలో కాబోయే తల్లికి బీటా-తలసేమియా ఉన్నట్లయితే వారిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒక మహిళ తలసేమియా క్యారియర్‌గా ఉన్నట్లయితే, వారు ఆ వ్యాధిని పిండానికి పంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. ప్రతి స్త్రీ గర్భం దాల్చిన మొదటి పది వారాలలోపు తలసేమియా రక్త పరీక్ష చేయించుకోవాలని సూచన.
గర్భధారణ సమయంలో సికిల్ సెల్ మరియు తలసేమియాలు రక్త పరీక్షల ద్వారా పరీక్షించబడతాయి. ఫలితాలు పాజిటివ్ అని వస్తే, పిండంపై ప్రభావాన్ని అంచనా వేయడానికి మరికొన్ని పరీక్షలు చేస్తారు. గర్భధారణ సమయంలో తలసేమియా గుర్తింపు కోసం పరీక్ష తీసుకునే ప్రతి స్త్రీ సికిల్-సెల్ పరీక్ష కోసం సిఫార్సు చేయబడదు. హిమోగ్లోబిన్‌కు సంబంధించిన పరిస్థితులు సాధారణంగా ఉన్న ప్రాంతాల్లో, కాబోయే తల్లిని సికిల్ సెల్ కోసం పరీక్ష చేయించుకోవాలని వైద్యులు కోరతారు. ఈ వ్యాధులు అసాధారణంగా ఉన్న ప్రాంతాల్లో, కుటుంబ మూలాలను తెలుసుకోవడానికి ఒక సర్వే తీసుకోబడుతుంది. ఆ సర్వే ప్రకారం.. సికిల్ సెల్ ప్రమాదం ఉందని తెలిసినట్లైతే స్క్రీనింగ్ చేయబడుతుంది.
తలసేమియా పరిస్థితి యొక్క తీవ్రత మరియు శిశువుపై దాని ప్రభావాలను అంచనా వేయడానికి వైద్యులు గర్భధారణకు ముందు కూడా పరీక్షలు చేయవచ్చు. కొన్ని తలసేమియా పరీక్ష పేర్లు క్రింది విధంగా ఉన్నాయి:
HbA2 అనేది హిమోగ్లోబిన్ రుగ్మత మరియు రక్తంలో దాని రకాన్ని గుర్తించే పరీక్ష. ఈ పరీక్షలో హిమోగ్లోబిన్ A2 పరీక్ష చేయబడుతుంది. గర్భధారణ సమయంలో HbA2 పరీక్షలో HbA2 స్థాయిలు పెరిగినట్లు చూపితే, స్త్రీకి తలసేమియా ఉందని అర్థం. అందువల్ల ప్రతి స్త్రీ తప్పనిసరిగా తీసుకోవలసిన కీలకమైన ప్రినేటల్ పరీక్షలలో ఇది ఒకటి. పరీక్ష ఫలితాలు సాధారణంగా ఒక వారంలోపు వస్తాయి. ఫలితాలు పాజిటివ్ అని వస్తే, జన్యు సలహా కోసం ఒక స్పెషలిస్ట్ నర్సును స్త్రీకి సిఫార్సు చేస్తారు.
తలసేమియా మైనర్ విషయంలో, మహిళ యొక్క రక్తహీనత పిండానికి హైపోక్సియాకు దారి తీస్తుంది. ఇది క్రమంగా పరిమిత గర్భాశయ పెరుగుదల (IUGR)కి దారితీస్తుంది. IUGR అనేది పిండం ఎదుగుదల తక్కువగా ఉండే పరిస్థితి. IUGR అనేది హిమోగ్లోబిన్ పరిస్థితులకు మాత్రమే సంబంధించినది కాదని కనుగొనబడింది. అనేక ఇతర అంశాలు కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితికి చికిత్స చేసిన తర్వాత, పిండం ఎటువంటి సమస్యలు లేకుండా పెరుగుతుంది. పిండానికి హాని కలిగించకుండా తలసేమియా మైనర్ మరియు గర్భం సహజీవనం చేయవచ్చు. ఇతర పరిశోధనలు కూడా తలసేమియా మైనర్ గర్భం మీద భయంకరమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదని నిర్ధారించాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భస్థ శిశువు గుండె చప్పుడును ఇంట్లోనే పరీక్షించటం ఎలా?
భారతదేశంలో ప్రెగ్నెన్సీ సమయంలో తలసేమియా పరీక్ష చేయించుకోవడం గురించి ఆలోచిస్తున్నట్లైతే, ప్రెగ్నెన్సీలో తలసేమియా పరీక్షకు ₹2,000 నుండి రూ.4,000 వరకు ఖర్చు అవుతుంది. అంతే కాకుండా.. ఇతర పరీక్షల ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే.. ఎవరైనా తలసేమియాకు రక్తమార్పిడితో చికిత్స చేయాలనుకుంటే భారతదేశంలో ఒక్కో రక్తమార్పిడికి ₹10,000 నుండి ₹15,000 వరకు ఖర్చవుతుంది. ఈ సమాచారం ప్రెగ్నెన్సీ సమయంలో తలసేమియాని అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన పరీక్షలు మరియు గర్భధారణ సమయంలో తలసేమియా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఎలా జాగ్రత్త వహించాలి అన్న విషయాలపై మీకు తగినంత సమాచారం ఇవ్వాలి.
Tags
Thalassemia Test in Pregnancy in English, Thalassemia Test in Pregnancy in Bengali, Thalassemia Test in Pregnancy in Tamil
Yes
No
Written by
Sri Lakshmi
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |