hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Pregnancy arrow
  • ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు arrow

In this Article

    ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

    Pregnancy

    ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు

    3 November 2023 న నవీకరించబడింది

    ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్‌స్ట్రువల్ పీరియడ్. చివరిసారిగా పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసుకొని డెలివరీ డేట్‌ను అంచనా వేస్తుంటారు. అయితే డెలివరీ డేట్‌ను అంచనా వేసేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్స్‌ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మహిళల పీరియడ్ ఉన్న కాలం, ఒవల్యూషన్ తేదీ లాంటివి ఖచ్చితత్వంపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా రెండు తేదీల మధ్య వ్యత్యాసం ఉంటుంది.

    గర్భవతి కచ్చితమైన డెలివరీ డేట్ ఎందుకు తెలుసుకోవాలి?

    గర్భవతి ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ద్వారా కడుపులో శిశువు ఖచ్చితమైన వేగంతో పెరుగుతుందో లేదో నిర్ణయిస్తుంటారు. సుదీర్ఘ గర్భాలను నివారించడానికి శిశువుకు ఇండక్షన్ అవసరమా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇది అవసరం కూడా. గర్భం దాల్చిన 42 వారాల్లో.. మహిళలకు ప్రసవం కోసం ఇండక్షన్ చేస్తుంటారు. ఒకవేళ ఈడీడీ చాలా దూరంగా ఉంటే, పిండం పూర్తిగా శిశువుగా తయారు కాకముందే జన్మించే అవకాశాలుంటాయి. కాబట్టి స్కానింగ్‌లో ఇచ్చిన తేదీ, ఎల్ఎంపీ తేదీలు వేర్వేరుగా ఉన్నాయేమోనని గమనించాలి. ఒకవేళ ఎల్ఎంపీకి, అల్ట్రాసౌండ్‌కు 4 వారాల తేడా ఉంటే, అప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా అంచనా వేసిన తేదీకి డెలివరీ డేట్ మార్చాలి.

    ఎల్ఎంపీ ద్వారా డెలివరీ డేట్‌ను ఎలా తెలుసుకోవాలి?

    అల్ట్రాసౌండ్ ద్వారా డెలివరీ డేట్ అంచనా వేయొచ్చు. ఒకవేళ మహిళ తనకు తానుగా డెలివరీ డేట్ అంచనా వేయాలనుకుంటే ఈ టిప్స్ పాటించవచ్చు.

    • చివరి పీరియడ్ ఎప్పుడు మొదలైందో ఆ తేదీ నోట్ చేసుకోవాలి.
    • దానికి ఏడు రోజులు కలిపి, మూడు నెలలు వెనక్కి వెళ్లాలి.
    • ఆ తర్వాత ఆ తేదీకి ఒక ఏడాది యాడ్ చేయాలి. ఇలా వచ్చే తేదీనే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీగా భావించవచ్చు.
    • రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే మహిళల్లో ఎల్ఎంపీ ద్వారా ఈడీడీ గుర్తించడం చాలా సులువు. అల్ట్రాసౌండ్ డేట్, ఈడీడీ డేట్ మధ్య మూడు వారాల తేడా ఉంటే, ఎల్ఎంపీ ద్వారా వచ్చిన ఈడీడీ వేలిడిటీని పరిశీలించాల్సి ఉంటుంది.

    అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా ఎల్ఎంపీ.. వీటిలో ఏది ఖచ్చితమైనది?

    కొన్ని సరైన పరిస్థితుల్లో ఎల్ఎంపీ ద్వారా వచ్చిన ఈడీడీ కచ్చితత్వంతో ఉంటుంది. సరైన పరిస్థితులు అంటే మహిళలకు రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడం, ఒవల్యూషన్ 14వ రోజు రావడం, అదే రోజు శిశువు గర్భం దాల్చడం లాంటివి. చాలా గర్భాల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఎల్ఎంపీ ద్వారా కచ్చితమైన డెలివరీ డేట్‌ను అంచనా వేయడం చాలా కష్టం. డెలివరీ డేట్‌ను అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ విశ్వసనీయ పద్ధతిగా పరిగణిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో శిశువు పరిమాణం కూడా సరిగ్గా తెలుస్తుంది. దాన్ని బట్టి వైద్యులు బేబీ వయస్సును కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. అయితే అల్ట్రాసౌండ్ ఫలితాలు ఖచ్చితంగా ఉండాలంటే.. గర్భవతి అయిన తర్వాత మొదటి ట్రమిస్టర్‌లోనే ఈ స్కానింగ్ చేయించాలి. అల్ట్రాసౌండ్ తేదీకి, ఎల్ఎంపీ డేట్‌కు మధ్య ఒక వారం తేడా ఉంటే, అల్ట్రాసౌండ్ తేదీ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీని లెక్కిస్తారు. ఒకవేళ అల్ట్రాసౌండ్ తేదీకి, ఎల్ఎంపీ డేట్‌కు మధ్య 5 రోజుల తేడా ఉంటే.. ఎల్ఎంపీ డేట్ ద్వారా డెలివరీ డేట్‌ను లెక్కిస్తారు. మొదటి ట్రమిస్టర్‌లో నిర్ణయించిన ఈడీడీని ప్రెగ్నెన్సీ సమయంలో మార్చకూడదు.

    ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు మార్చే అవకాశం ఉంది?

    అనేక సందర్భాల్లో.. గర్భవతులు మొదటి ట్రమిస్టర్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించరు. 18 నుంచి 20 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రాసౌండ్ చేయిస్తారు. ఈ సమయంలో గర్భవతులు అల్ట్రాసౌండ్ చేయిస్తే, ఎల్ఎంపీ తేదీకి, అల్ట్రాసౌండ్ డేట్‌కు మధ్య 10 రోజుల వ్యత్యాసం ఉంటే, అప్పుడే అల్ట్రాసౌండ్ ఫలితాలను అంచనా వేసి డెలివరీ డేట్‌ను మార్చుకోవచ్చు.

    డెలివరీ డేట్ ఎల్ఎంపీలో అల్ట్రాసౌండ్‌లో ఎందుకు వేర్వేరుగా ఉంటుంది?

    సాధారణంగా ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ తేదీల మధ్యా 2 వారాల వ్యత్యాసం ఉంటుంది. మొదటి రెండు వారాల్లో, ఎల్ఎంపీ నుంచి వచ్చిన తేదీ ప్రకారం చూస్తే మహిళ గర్భవతి కాదు. కానీ ఆ సమయంలో అండోత్సర్గం సాధారణంగా జరుగుతుంది. అయితే కొన్ని కేసుల్లో ఎల్ఎంపీ తేదీకి, అల్ట్రాసౌండ్ స్కాన్ తేదీకి మధ్య చాలా రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒవల్యూషన్ సాధారణ తేదీ కన్నా తర్వాత జరిగి, గర్భధారణ తేదీని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ తేదీల మధ్య రెండు వారాల వ్యత్యాసం ఉంటే, ఎల్ఎంపీ తేదీపై ఆధారపడలేం. ఈడీడీ కోసం అల్ట్రాసౌండ్ తేదీని పరిగణలోకి తీసుకోవాలి.

    గర్భధారణ వయస్సు, యాక్చువల్ అల్ట్రాసౌండ్ ఏజ్‌ను అర్థం చేసుకోండి

    ఎల్ఎంపీ తేదీ నుంచి 40 వారాలను కలిపి లెక్కించే కాలాన్ని గర్భధారణ వయస్సు అంటారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అందులో GA అని ఉంటే దాన్ని గర్భధారణ వయస్సుగా భావించాలి. ఓయూఏ అంటే యాక్చువల్ అల్ట్రాసౌండ్ ఏజ్‌ను శిశువు అసలు వయస్సును అంచనా వేయడానికి పరిగణలోకి తీసుకుంటారు. GA LMP Vs GA AUA మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఉంటుంది. GA LMP కన్నా, GA AUA వేర్వేరుగా ఉంటుంది. GA LMP లో గర్భధారణకు, చివరి పీరియడ్‌కు మధ్య రోజుల్ని మినహాయిస్తారు.

    ముగింపు

    ఎల్ఎంపీ ఉపయోగించే డెలివరీ డేట్‌ను అంచనా వేయడం చవకైన ఆప్షన్. అయితే కచ్చితమైన తేదీ తెలుసుకోవడానికి వీలైనంత త్వరగా అల్ట్రాసౌండ్ చేయించాలి. ఒకవేళ.. ఎల్ఎంపీ డ్యూడేట్, అల్ట్రాసౌండ్ డేట్ మధ్య వ్యత్యాసం 1 వారం కన్నా తక్కువ ఉంటే, ఎల్ఎంపీ డ్యూ డేట్‌ని కొనసాగించవచ్చు. కానీ, 2 వారాల వ్యత్యాసం ఉంటే అల్ట్రాసౌండ్ తేదీని పరిగణలోకి తీసుకోవాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |