hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • ఆటిజం స్పెక్ట్రమ్: లక్షణాలు, సమస్యలు & చికిత్స arrow

In this Article

    ఆటిజం స్పెక్ట్రమ్: లక్షణాలు, సమస్యలు & చికిత్స

    Baby Care

    ఆటిజం స్పెక్ట్రమ్: లక్షణాలు, సమస్యలు & చికిత్స

    3 November 2023 న నవీకరించబడింది

    ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది సాధారణంగా చిన్న వయస్సులోనే మొదలయ్యే అవాంఛనీయ పరిస్థితి. ఇది ఒక వ్యక్తి సమాజంతో ఎలా వ్యవహరించాలో ఇంకా మసలుకోవాలనే తీరుని తీవ్రంగా ప్రభావితం చేసే మానసిక స్థితి. వ్యక్తులతో వ్యవహరించడం ఇంకా సంభాషించడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఎన్నో ఆటిజం వల్ల కలుగుతాయి. అయితే.. ఆటిజం లక్షణాలను ఖచ్చితంగా గుర్తించడానికి, ఆటిజం అంటే ఏమిటి ఇంకా అది పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి.

    ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే ఏమిటి?

    ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) లేదా ఆటిజం అనేది నాడుల ఎదుగుదల పరిస్థితుల శ్రేణులను నిర్వచించడానికి ఉపయోగించే ఒక విసృతార్థకం. ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా వారి ప్రవర్తనలో కొన్నిసార్లు ఒకే తీరును పదేపదే ప్రదర్శిస్తారు. ఈ పరిస్థితి అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆటిజానికి సరైన అర్థాన్ని వివరించడం డాక్టర్లకు కష్టసాధ్యమవుతుంది. ఇంకా అది ఎందుకు పుడుతుంది అనే ఖచ్చితమైన కారణం, దానిని పూర్తిగా నయం చేయగల ఆటిజం చికిత్స ఇప్పటివరకైతే ఉనికిలో లేదు. అయినప్పటికీ.. కొన్ని చికిత్సలు ఇంకా పద్ధతులు ఇలాంటి పిల్లల పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి కానీ పూర్తిగా నయం చేయలేవు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి?

    ఆటిజం స్పెక్ట్రమ్ లక్షణాలు & సంకేతాలు

    కొన్ని సాధారణ సంకేతాలు మరియు ఆటిజం లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి-

    • ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తికి అదే వయస్సులో ఉన్న ఇతర వ్యక్తుల కన్నా సామాజిక వ్యవహారశైలి నైపుణ్యాలు ఉండవు.
    • ASD ఉన్న వ్యక్తులకి పునరావృతమయ్యే ప్రవర్తనలు ఉంటాయి ఇంకా అసాధారణ ఆసక్తులను కనబరుస్తారు.
    • వారు మామూలు వ్యక్తుల కంటే ఆలస్యంగా భాషా నైపుణ్యాలను పొందుతారు
    • ASD ఉన్న కొంతమందికి మూర్ఛ కూడా ఉండవచ్చు.
    • సక్రమంగా ఉండని నిద్ర ఇంకా తినే సమయాలు
    • భయం లేకపోవడం లేదా ఉంటే అధికంగా ఉండటం
    • అసాధారణ మనస్థితి
    • అతిచురుకుగా ఇంకా ఆవేశపూరితంగా ఉండటం
    • జీర్ణ సమస్యలు
    • మేధావికాసంలో ఆలస్యం

    ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కోసం నిర్ధారణ ఇంకా పరీక్ష

    శారీరక లేదా రక్త పరీక్షలు చేయనందున ASD నిర్ధారణ ఇతర అనారోగ్యల నిర్ధారణ కన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ.. డాక్టర్ పిల్లలలో కొన్ని ఎదుగుదల లక్షణాలను గమనిస్తారు. పిల్లలకి ఆటిజం ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్య నిపుణులు ఈ క్రింది పరీక్షలు చేస్తారు.

    • వారు ఇతర వ్యక్తులతో కలిసి పరస్పరం మాట్లాడేటప్పుడు పిల్లవాడు మామూలుగా ఉంటున్నారా ఇంకా వారి భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఎలా ఉన్నాయో పరీక్షిస్తారు.
    • పిల్లల మాటలు, భాష, ప్రవర్తన మరియు అభివృద్ధి స్థాయిలను అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు పెడతారు.
    • వైద్య నిపుణులు పిల్లలకు అందరితో కలిసేలా ఏర్పాటు చేస్తారు. ఇంకా వారి వ్యవహారించవలసిన తీరును గుర్తు చేస్తారు.
    • మానసిక రుగ్మతల నిర్ధారణ మరియు గణాంక మాన్యువల్ (DSM-5)లో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా వారు పిల్లల లేదా వ్యక్తుల పనితీరును అంచనా వేస్తారు.
    • పిల్లలకి ఈ పరిస్థితికి కారణమయ్యే రెట్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యుపరమైన రుగ్మతలు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి వైద్యులు కొన్ని జన్యు పరీక్షలను కూడా నిర్వహించవచ్చు.

    చర్యలు ఇంకా చికిత్స ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌కు పరిచర్యలు

    ఈ ASD వల్ల కలిగే ప్రధాన సమస్యలను పరిష్కరించగల కీలక పరిచర్యలను గుర్తించడంలో గణనీయమైన పురోగతి ఉంది. అయినప్పటికీ.. ASD ఉన్న వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి సరైన సపరిచర్యలు గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. మేధోపరమైన చికిత్సలు అందించినపుడు అది ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల సామాజిక లోపాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అనువర్తింపదగిన ప్రవర్తన విశ్లేషణ పద్ధతులు ఇంకా సామాజిక నైపుణ్యాల శ్రేణులు ASD ఉన్న వారు తెలుసుకొనే విషయాలను సులభతరం చేస్తాయి.

    పెద్దలలో ఇంకా యుక్తవయసు వారిలో ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మత

    ASD ఉన్న చాలా మంది పెద్దలు వారి కౌమారదశ ఇంకా యుక్తవయస్సును ఎంతో కష్టతరంగా దాటి వచ్చినవారే. ASD ఉన్న చాలా మంది యువకులకు వారి ఈ పరిస్థితి కారణంగా వారి తోటివారి కంటే తక్కువ అవకాశాలు పొందుతున్నారు. దీని ఫలితంగా ASD ఉన్న యువకులలో అధిక నిరుద్యోగిత రేటు ఇంకా ఉన్నత విద్యలలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉంటోంది. అంతేకాక.. వీరు పెద్దయ్యాక కూడా వారి కుటుంబ సభ్యులతో జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితితో బాధపడుతున్న కొంతమంది యువకుల ఆరోగ్యంలో మార్పును కూడా గమనించారు. ఇంకా వీరు ఎన్నెన్నో ఆరోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇది సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

    ప్రవర్తనా పద్ధతులు

    అబ్బాయిలు లేదా అమ్మాయిలలో ఆటిజం సంకేతాలను నిర్ధారించిన తర్వాత వైద్యులు ఉపయోగించే ఒక ప్రసిద్ధ పద్ధతి ప్రవర్తనా విశ్లేషణ. ఇది ఒక వ్యక్తిలో కావలసిన ప్రవర్తనలను ప్రోత్సహించే పద్ధతి. అదే సమయంలో, ASD ఉన్న వ్యక్తిలో సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి అవాంఛనీయ ప్రవర్తనను నిరుత్సాహ పరచబడుతుంది. వివేచనశీల మార్గంలో శిక్షణ(డిస్‌క్రీట్ ట్రైల్ ట్రైనింగ్) ఇంకా పీవోటల్ రెస్పాన్స్ ట్రైనింగ్(కీలక ప్రతిస్పందన శిక్షణ) అనేది ప్రవర్తనా చికిత్సలో రెండు అత్యంత ప్రభావవంతమైన శైలులు.

    ప్రమాద కారకాలు

    పసిపిల్లలలో ఆటిజం సంకేతాలను కలిగించే కొన్ని ప్రమాద కారకాలు -

    • ASDతో బాధపడుతున్న తోబుట్టువులు ఉన్నప్పుడు
    • ట్యూబరస్ స్క్లెరోసిస్ లేదా ఫ్రాజిల్ x సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితుల ఉనికి ఉన్నప్పుడు
    • ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు
    • పెద్ద వయసున్న తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు

    మామూలుగా ఎదుగుతున్న పిల్లల నుండి ఆటిస్టిక్ పిల్లలను ఎలా గుర్తించాలి

    చిన్ననాటి ఆటిజం చూపించే అత్యంత ప్రధాన సంకేతాలలో ఒకటి ఏమిటంటే.. పిల్లవాడు స్వతస్సిద్ధంగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకా తరచుగా అది ఏ విషయాన్ని సూచించనిదిగా ఉంటుంది. ఆటిస్టిక్ పిల్లలు తమ పరిసరాల పట్ల నిరాసక్తిగా ఇంకా పరధ్యానంగా ఉంటారు. ఇంకా, వారి తోటివారు అనర్గళంగా ఉచ్చరించగలిగే పదాలను ఉచ్చరించడం కూడా వారికి చాలా కష్టతరంగా ఉంటుంది.

    ASD ఎంత తరచుగా సంభవించవచ్చు

    CDC వారి ఆటిజం అండ్ డెవలప్‌మెంటల్ డిజేబిలిటీస్ మానిటరింగ్ (ADDM) నెట్‌వర్క్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. నలభై-నాలుగు మంది పిల్లలలో ఒక్కరికి ASD ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతీ ఒక్కరూ ఆటిజం గురించి తెలుసుకోవలసిన అన్నీ విషయాలు ఇవి. అంతేకాక, ఎవరైనా తమ పిల్లలలో లేదా ఇంకెవరైనా సన్నిహిత మిత్రులు లేదా బంధువులలో పైన పేర్కొన్న ఏవైనా సంకేతాలను గమనించినట్లయితే.. వారు డాక్టరు గారిని సంప్రదించాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.

    Product Categories

    baby test | test | baby lotions | baby soaps | baby shampoo |