Diet & Nutrition
3 November 2023 న నవీకరించబడింది
కుంకుమపువ్వు అనేది ఆసియాలో లభించే ఒక సుగంధ ద్రవ్యము. దీనిని శాస్త్రీయనామం క్రోకస్ సాటివస్. ఇది ఔషధ మొక్కగా మంచి చరిత్రను కలిగి ఉంది. ఇది తరచుగా తీపి వంటలలో రంగు ఇంకా సువాసన ఇచ్చే దినుసుగా ఉపయోగించబడుతుంది.
కుంకుమపువ్వు చాలా మృదువుగా ఉంటుంది. ఇంకా సున్నితమైన రుచిని కాస్తంత సువాసనను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా రుచికరమైన వంటకాలకు రుచిని కోసం ఇంకా లేత పసుపు రంగు కోసం ఉపయోగిస్తారు. ఇది పెల్లా, రిసోట్టోస్ మరియు బిర్యానీ వంటి వంటకాలలో వాడినప్పుడు అవి చక్కగా తయారవుతాయి. కుంకుమపువ్వు వల్ల ఇతర ఉపయోగాలు ఏమిటంటే.. తీపి వంటలలో సహజ సుగంధ ద్రవ్యంలా ఉపయోగించడం. దాని మృదువైన సువాసన కస్తూరి లాంటి రుచినిచ్చే కేకులు, కుకీలు, కస్టర్డ్స్ వంటి కాల్చిన వస్తువులకు మంచి రుచిని తీసుకొస్తుంది. వంటకు అద్భుతమైన సువాసనను అందించడానికి పాకశాస్త్ర నిపుణులు తరచుగా ఈ కుంకుమ పువ్వుపైనే ఆధారపడతారు.
పాకశాస్త్ర ప్రపంచములోనే కాకుండా, కుంకుమపువ్వు అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం దానిని విరివిగా ఉపయోగిస్తారు. పుష్పంలోని సన్నని ఒక కేసరం డిప్రెషన్ మరియు మూడ్ స్వింగ్(మానసిక అస్థిరత)లకు చికిత్స చేసే శక్తిని కలిగి ఉంటుంది. కుంకుమపువ్వులో ఉండే పదార్థాలు శరీరంలోని వాత, పిత్త మరియు కఫ దోషాలను సమతుల్యపరుస్తాయి. ఆయుర్వేదాన్ని అనుసరించి.. ఈ దోషాలలో అసమతుల్యత వలన అనారోగ్యాలు కలుగుతాయి. ఈ కారణంగానే కుంకుమపువ్వు ఔషధ పరంగా ఎంతో విలువైనది.
కుంకుమపువ్వు వల్ల కలిగే కొన్ని సాధారణ ఔషధ ఉపయోగాలు ఏమిటంటే
ఇది శరీర కణాల స్వస్థతకు సహాయపడుతుంది. ఇంకా నొప్పి నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది. కుంకుమపువ్వులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ బారినుండి రక్షిస్తాయి. ఇవి ప్రధానంగా మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడమే కాక, బరువు తగ్గెందుకు సహాయం చేస్తుంది. ఆకలిని తగ్గించడం ఇంకా యాంటిడిప్రెసెంట్ లాంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది.
కుంకుమపువ్వును “సన్‌షైన్ స్పైస్" అని కూడా పిలుస్తారు. చాలా అధ్యయనాలు కుంకుమపువ్వు రేకులు ఇంకా కేసరాలు తేలికపాటి నుండి ఒక మాదిరి డిప్రెషన్ లక్షణాల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. కేవలం 30 గ్రాముల కుంకుమపువ్వు రోజువారీ ఫ్లక్సెటైన్ లేదా సిటోప్రామ్ వంటి డిప్రెషన్‌కు వాడే ప్రామాణిక మందుల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. కుంకుమపువ్వు సప్లిమెంట్లుగా ఇచ్చిన వ్యక్తులు కూడా తక్కువ దుష్ప్రభావాల బారినపడ్డారు.
కుంకుమపువ్వులోని అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్ వల్ల జరిగే హానిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు హానికరమైన ఈ రాడికల్స్ కారణమని తెలిసింది. అలాగే.. కుంకుమపువ్వులో ఉండే సమ్మేళనాలు పెద్దప్రేగులోని క్యాన్సర్ కణాలను నశింపజేసి, అణిచివేస్తాయి. మరొక అధ్యయనం ప్రకారం.. కుంకుమపువ్వు అతి ముఖ్యమైన ఉపయోగాలలో ఒకటి, ఇది క్యాన్సర్‌తో పోరాడుతుంది. కుంకుమపువ్వులోని క్రోసిన్స అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలను కీమోథెరపీ ఔషధాలకు మరింత ఎక్కువగా స్పందించేలా చేస్తుంది.
20 నిమిషాల పాటు కుంకుమపువ్వు వాసన చూడడం లేదా ప్రతిరోజూ 30 మి.గ్రా తీసుకోవడం వల్ల చిరాకు, తలనొప్పి ఇంకా తిమ్మిరి వంటి వివిధ PMS లక్షణాలను తగ్గించవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది PMS సమయంలో కలిగే ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాక శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
ఎన్నో తరాలుగా, కుంకుమపువ్వు కామోద్దీపన లక్షణాల గురించి అందరికీ తెలుసు. పాలలో కుంకుమపువ్వు కలుపుకుని రాత్రిపూట సేవించేందుకు కారణం ఇదే. ప్రతిరోజూ కనీసం 30 మి.గ్రా కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల పురుషులలో అంగస్తంభన, లైంగిక వాంఛ ఇంకా సంపూర్ణ సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. మహిళల్లో, కుంకుమపువ్వు మెరుగైన లూబ్రికేషన్ ఇంకా లైంగిక వాంఛను పెంచుతుంది.
సహజమైన బరువు తగ్గించే అనేక సప్లిమెంట్లలోని ప్రధాన పదార్ధాలలో కుంకుమపువ్వును కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే రోజువారీ కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ఆకలిని సహజంగా అరికట్టవచ్చు. ఇంకా త్వరగా బరువు తగ్గవచ్చు. కుంకుమపువ్వు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దీని ఫలితంగా చిరుతిండ్లు తినడం తక్కువవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు కుంకుమపువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వారి బాడీ మాస్ ఇండెక్స్ విలువ తగ్గుతుంది ఇంకా శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుంది.
ఆహారంలో సులువుగా చేర్చుకోగల సాధారణ దినుసు ఈ కుంకుమపువ్వు. దీని సున్నితమైన రుచి ఆహారపు రుచిని మార్చదు. అంతేకాక.. ఇది అందమైన పసుపు రంగును మాత్రమే దానికి ఇస్తుంది. ఇంకా ఆ పదార్థాపు పోషక విలువను పెంచుతుంది. ఇది ఖరీదైనది అయినప్పటికీ.. అందులోని అనేక ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఒక వంటలో చిటికెడు వేసినంత మాత్రమే సరిపోతుంది.
కుంకుమపువ్వు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, దానిని తగు జాగ్రత్తలతో తీసుకోవాలి. చాలా సహజ పదార్ధాల వలె, కుంకుమపువ్వులో చెప్పుకోదగ్గ దుష్ప్రభావాలు ఉండవు. అయితే.. అనుసరించాల్సిన కొన్ని మోతాదుల పరిమితులు ఉన్నాయి. కుంకుమపువ్వు ఉపయోగం ద్వారా సానుకూల ప్రయోజనాలను పొందడానికి, రోజుకు 30 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేయబడింది. అధిక మోతాదులు తీసుకుంటే ఇది విషపూరితం కావచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది గర్భస్రావాలకు దారితీస్తుంది. అలాగే, కుంకుమపువ్వును నమ్మకాస్తుల నుండి కొనడం చాలా అవసరం. కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కుంకుమపువ్వు పొడిని కొనడం మానుకోవాలి.
సరైన పద్ధతిలో తీసుకుంటే కుంకుమపువ్వు ఒక అద్భుతమైన మూలిక. సహజ పదార్థాలు వేర్వేరు వ్యక్తులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తాయి. కొన్ని రకాల ఆహారాల పట్ల సున్నితత్వం కలిగి ఉన్నవారు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
References
1. Omidkhoda SF, Hosseinzadeh H. (2022). Saffron and its active ingredients against human disorders: A literature review on existing clinical evidence. Iran J Basic Med Sci.
2. Jackson PA, Forster J, Khan J, Pouchieu C, Dubreuil S, Gaudout D, Moras B, Pourtau L. (2021).Effects of Saffron Extract Supplementation on Mood, Well-Being, and Response to a Psychosocial Stressor in Healthy Adults: A Randomized, Double-Blind, Parallel Group, Clinical Trial. Front Nutr.
What is Saffron in Telugu, What are benefits of Saffron in Telugu, What are the uses of Saffron in Telugu, What are the risk of Saffron in Telugu, Saffron-Benefits, Drawbacks, and More in English, Saffron-Benefits, Drawbacks, and More in Hindi, Saffron-Benefits, Drawbacks, and More in Tamil, Saffron-Benefits, Drawbacks, and More in Bengali
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
మొదటి 12 నెలల్లో మీ శిశువుతో మీరు చేయాల్సిన 12 విషయాలు|12 things that you must do with your baby in the first 12 months in Telugu
మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu
When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby test | test | baby lotions | baby soaps | baby shampoo |